భగవత్ బంధువులకు,  

మన భరతమాత పుణ్యవతి.  

అనేక పుణ్యతీర్థములు పుణ్యనదీ నదములు పవిత్ర ఉత్తుంగ శిఖరములు, అనేక మహారణ్యములకు ఆలవాలమై సనాతన వేద ధర్మము విరాజిల్లుతూ ఆధర్మమునకు విరుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు పరమాత్మ అనేక అవతారములు దాల్చుతూ ఎందరో ధర్మపురుషుల బోధనలతో పునీతయుగు ఈ భూమి యందు బౌద్ధ, జైన, కాపాలిక, చార్వాక పాషండ మతములతో ప్రజల జీవన స్థితిగతులు అల్లకల్లోలమైన సందర్భమున క్రీ.శ.  

7వ శతాబ్ది యందు కేరళ రాష్ట్రం కాలడి యను గ్రామమునందు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబ మున సాక్షాత్తు శంకరులు ఆర్యాంబ శివగురు పుణ్యదంపతుల గర్భమున ఆదిశంకర రూపమున ఆవిర్భవించిరి.  

తన ఐదవ సంవత్సరమునే సన్యసించి నర్మదాతీర వాసియైన గోవిందపాద యతివర్యుల వద్ద శిష్యరికం చేసి అనేక విద్యలను అభ్యసించి కాశీ క్షేత్రమందు విశ్వేశ్వరున్ని దర్శించి ఆ గంగా నదీ తీరమున బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీతకు అద్వైత సిద్ధాంతము మూలముగా భాష్యములు రచించి,
అవి జగత్ప్రచారముగావింప సంసిద్ధులై మాహిష్మతీపుర వాసియైన మండనమిశ్రులతో వాదము చేయ నారంభించి ఉభయభారతిని న్యాయ నిర్ణేతగా చేసుకొని ఆవాదనలోమండనమిశ్రునిఓడించి సురేశ్వరాచార్యమముతో సన్యాసదీక్ష యొసంగి తన శిష్యునిగా స్వీకరించి పద్మపాదుడు హస్తామలకుడు, తోటకా చార్యులని శిష్యులుగా గ్రహించి సనాతన వైదిక ధర్మమును పునరుద్ధరింపనెంచి

భారతదేశ నలుచెరగుల నాలుగు పీఠములు, నాలుగు మహావాక్యముల ఆధారముగా స్థాపించి అనేక ప్రకరణ గ్రంథములు, స్తోత్రములు రచించి శిష్యులకు జ్ఞానబోధ చేసి తన ముప్పదిరెండవ సంవత్సరమున కేదార్ నాథ్ మీదుగా కైలాసమును చేరిరి.

ఆదిశంకరులు స్థాపించిన 4 పీఠములలో తలమానికమగు పీఠము దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠము.  

ఈ పీఠ ప్రథమ గురువు సురేశ్వరాచార్యులు.  

ఈ జగద్గురు పరంపరలో ప్రస్తుతం ముప్పది ఆరు, ముప్పది ఏడవ పీఠాధిపతులుగా పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామి, వీరి కర కమల సంజాతులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వాములు నడయా డుచూ ఈ పుడమిపై సనాతన ధర్మ ప్రచారం చేస్తూ భగవదారాధనా వైశిష్ట్యమును తెలుపుతూ ఎందరికో ధర్మ సందేహములు తీర్చుతూ వారి పాద సేవాభాగ్యమును మనకు అందిస్తున్నారు.  

వారికి శత సహస్ర ప్రణామములు సమర్పిస్తున్నాను.  

భరద్వాజస గోత్ర మోక్షగుండం వెంకట సుబ్బయ్య శర్మ అను నేను గత ముప్పది సంవత్సరముల క్రితము కర్నూలు పట్టణ డాక్టర్స్ కాలనీ, పార్థసారధి నగరనందు శ్రీలలితా త్రిపుర సుందరీ ఆలయము నిర్మించి మా ఆత్మీయ భక్తుల సహాయ సహకారముతో అనేక చండీ హవనములు, మహాన్యాస పూర్వక మహాలింగార్చనలు చేస్తూ నా శక్తికొలది ఆతల్లిని అర్చిస్తూ ఉన్నాను.

శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బ|| ఏకాదశి శనివారము 04-05-2024వ తేదీన శ్రీశృంగేరి శారదా పీఠ మహా స్వాములను దర్శించి ఈ దేవాలయమునకు విచ్చేసి తమ పవిత్ర కరకమలములతో ఆలయ కుంభాభిషేకమొనర్చి, ఈ ఆలయము ఉచ్ఛస్థితితో వెలిగించగలరని ఆశిస్తూ ఒక లేఖను వారి పాదముల యందుంచితిని.  

శ్రీ విధుశేఖర భారతీ మహా స్వామి ఆమూలాగ్రము చదివి, ఇచ్చట జరుగు వైదిక కర్మల తీరుతెన్నులు తెలుసుకొని ప్రసన్న చిత్తముతో మేము ఆ ఆలయమునకు వచ్చి కుంభాభిషేకము నిర్వహిస్తాము అని ఆశీర్వదించి పూర్ణ ఫలమును అందిస్తూ నిత్యము మీరు చేయవలసినవి చేయండి అని ఆనతిచ్చిరి.  

వారి పలుకులు దివ్యానుగ్రహంగా భావించి ఆ కార్యములు నెరవేర్చుటకు పూనుకొంటిమి.  

ఆ శారాదామాత జగద్గురువులచే ప్రేరితులమై మేము కొనసాగించు ఈ యజ్ఞ క్రతువులు (నిత్య శ్రీచక్ర నవావరణ అర్చన, రుద్రహోమం ప్రతి పౌర్ణమికి అమావాస్యకు చండీహవనములు) నిరవధికంగా జరుగుటకు సనాతన ధర్మావలంబులైన తమకు ఈ కరపత్రము నందించుచున్నాను.  

ధర్మో రక్షతి రక్షిత: అనునట్లు అందరూ ఈ వైదిక ధర్మమునకు సహాయ సహకార ముయొనర్చి శ్రీ శారదామాత, జగద్గురువుల కృపకు పాత్రులగుదురని ఆశిస్తున్నాము.  

ఇట్లు..  

శ్రీలలితా త్రిపుర సుందరీ దేవాలయ భక్త బృందము

  • Jaya Jaya Shankara, Hara Hara Shankara.

  • Sri Lalita Tripurasundari Temple, Kurnool.

  • “Shruti Smruti Purananam Alayam Karunalayam Namami Bhagavatpada Shankaram Loka Shankaram.” (I bow to the compassionate Bhagavatpada Shankara, the abode of Vedas, Shastras, and Puranas, who is the benefactor of the world.)

  • To all devotees of the Lord,

  • Our Mother India is a land of virtue.

  • The land is home to numerous holy rivers, sacred pilgrimage sites, towering peaks, and vast forests where the eternal Vedic Dharma has flourished. Whenever circumstances arose that were contrary to this Dharma, the Supreme Being took many incarnations. In this land, purified by the teachings of many righteous souls, during a time when the lives of people were in turmoil due to the influence of Buddhist, Jain, Kapalika, Charvaka, and heretical sects—

  • In the 7th century A.D., in a village named Kalady in Kerala, the great Shankara was born as Adi Shankara to the virtuous couple Aryamba and Shivaguru in a Nambudri Brahmin family.

  • He took Sannyasa (renunciation) at the age of five. He became a disciple of the great ascetic Govindapada on the banks of the Narmada and mastered many disciplines. He had the vision of Lord Vishweshwara in Kashi. On the banks of the Ganges, he wrote commentaries (Bhashyas) on the Brahma Sutras, Upanishads, and the Bhagavad Gita, based on the Advaita philosophy. Prepared to propagate this to the world, he began a debate with Mandana Mishra of Mahishmati. Appointing Ubhaya Bharati as the judge, he defeated Mandana Mishra in the debate. He gave him Sannyasa initiation with the name Sureshwaracharya and accepted him as his disciple. He also accepted disciples like Padmapada, Hastamalaka, and Totakacharya. With the intent to revive the eternal Vedic Dharma, he established four Peethas in the four corners of India based on the four Mahavakyas.

  • He composed many treatises and hymns, imparted knowledge to his disciples, and reached Kailash via Kedarnath in his thirty-second year.

  • Among the four Peethas established by Adi Shankara, the crown jewel is the Dakshinamnaya Sringeri Sharada Peetham.

  • The first Guru of this Peetham was Sureshwaracharya.

  • In this lineage of Jagadgurus, the current 36th and 37th Peethadhipatis are Paramahamsa Parivrajakacharya Sri Sri Sri Bharati Tirtha Mahaswami and his successor, Sri Sri Sri Vidhushekhara Bharati Swamiji. They walk this earth, propagating Sanatana Dharma, explaining the greatness of divine worship, resolving the spiritual doubts of many, and blessing us with the fortune of serving at their lotus feet.

  • I offer them my humble prostrations a hundred thousand times.

  • I, Mokshagundam Venkata Subbayya Sharma of the Bharadvaja Gotra, built the Sri Lalita Tripurasundari Temple thirty years ago in Doctors’ Colony, Parthasarathi Nagar, Kurnool. With the help and cooperation of my close devotees, I have been performing various Chandi Havanams and Mahanyasa Purvaka Mahalingarchanas, worshipping the Mother to the best of my ability.

  • On Saturday, May 4, 2024 (Chaitra Bahula Ekadashi of the Sri Krodhi Nama year), I had the darshan of the Jagadgurus of the Sri Sringeri Sharada Peetham. I placed a letter at their feet, requesting them to visit this temple and perform the Kumbabhishekam with their holy hands, hoping to elevate the status of this temple.

  • Sri Vidhushekhara Bharati Mahaswami read the entire letter, learned about the nature of the Vedic rituals performed here, and with a pleased heart, blessed us by saying, “We will come to the temple and perform the Kumbabhishekam.” Offering his blessings, he instructed us to continue our daily worship.

  • Considering their words as divine grace, we have resolved to fulfill these tasks.

  • Inspired by the Mother Sharada and the Jagadgurus, I am providing this pamphlet to you, the followers of Sanatana Dharma, so that the rituals we are continuing (daily Sri Chakra Navavarana Archana, Rudra Homam, and Chandi Havanams on every Pournami and Amavasya) may continue uninterrupted.

  • As the saying goes, “Dharmo Rakshati Rakshitah” (Dharma protects those who protect it), we hope that everyone will support this Vedic Dharma and become recipients of the grace of Mother Sharada and the Jagadgurus.

Yours,

The Devotee Group of Sri Lalita Tripurasundari Temple.

Seva and Darshanam